విజయనగరం జిల్లా పార్వతీపురం మండలం బంటువాని వలస సమీపంలో గుర్తు తెలియని యువకుడు చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. 25 ఏళ్ల వయసున్న యువకుడు చెట్టుకు వేలాడుతూ.. ఉండటాన్ని గమనించిన గ్రామస్థులు పోలీసులుకు సమాచారం ఇచ్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వీరబాబు తెలిపారు. ఆ యువకుడు ఒడిశా రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా భావిస్తున్నామని... పూర్తి వివరాల కోసం ఆరా తీస్తున్నట్లు చెప్పారు.
ఉరి వేసుకుని యువకుడు బలవన్మరణం - విజయనగరం జిల్లా తాజా వార్తలు
గుర్తుతెలియని ఓ యువకుడు చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన విజయనగరం జిల్లా పార్వతీపురం మండలం బంటువాని వలస సమీపంలో నెలకొంది.
చెట్టుకు ఉరి వేసుకుని యువకుడు బలవన్మరణం