విజయనగరం జిల్లా పార్వతీపురం పండా వీధిలో పూరిల్లు కూలి మహిళ తీవ్రంగా గాయపడింది. ఇటీవల కురిసిన వర్షాలకు గోడలు నాని ఇల్లు కూలింది. అందులో ఉంటున్న రాధ అనే మహిళ తీవ్రంగా గాయపడింది. శిధిలాల కింద చిక్కుకున్న ఆమెను అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, స్థానికులు సుమారు రెండు గంటలు శ్రమించి బయటకు తీశారు. తీవ్రంగా గాయపడటంతో బాధితురాలిని ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. రెవెన్యూ అధికారులు సంఘటనా ప్రాంతాన్ని పరిశీలించారు.
RAINS EFFECT: వర్షాలతో కూలిన పూరిల్లు.. మహిళకు తీవ్రగాయాలు - women Seriously injuried by damaged house
గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పూరిల్లు కూలటంతో ఓ మహిళ తీవ్రంగా గాయపడింది. విజయనగరం జిల్లా పార్వతీపురంలో ఈ ఘటన జరిగింది.
శిథిలాల కింద చిక్కుకున్న మహిళ