విజయనగరం జిల్లా చీపురుపల్లి బాలుర ఉన్నత పాఠశాల ఆవరణంలోని నేరేడు చెట్టుపై ఓ తెల్లని ఉడత చెంగు చెంగున తిరుగుతూ ఆకట్టుకుంటోంది. తెల్లగా ఉన్న ఆ ఉడత పాఠశాల ఆవరణలోని నేరేడు చెట్టుపై పళ్లను తింటూ అటూ ఇటూ తిరుగుతోంది. కొద్ది రోజులుగా పాఠశాల పరిసరాల్లో ఈ ఉడత తిరుగుతున్నట్లు పాఠశాల ఉపాధ్యాయులు చెబుతున్నారు. ఈ ఉడతకు ఎటువంటి హానికరం కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు.
చూడ ముచ్చటైన తెల్లని ఉడత.. ఎక్కడుందో తెలుసా..? - White squirrel latest information
రామ వారధి నిర్మాణంలో సాయమందించి కోదండరాముని స్పర్శకు పులకించాయి ఉడతలు.. రామయ్య స్పర్శతో వాటి శరీరంపై చారలు ఏర్పడ్డాయి. ఇది పురాణ కథనం.. కానీ అసలు శరీరంపై ఎటువంటి చారలు లేని, తెల్లని ఉడతను మీరు ఎప్పుడైనా చూశారా..? అయితే ఈ కథనాన్ని చదివేయండి..
తెలుపు రంగు ఉడత