ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సరదాకు పోతే.. విద్యార్థి ప్రాణం మీదికొచ్చింది..! - Cooker exploded at Kopperla Gurukul school

ఓ సరదా.... ఆ విద్యార్ధి ప్రాణంమీదికి తెచ్చింది. శరీరమంతా వేడి బొబ్బలొచ్చి... ఆసుపత్రి పాలయ్యేలా చేసింది. తల్లిదండ్రులనే కాక.. అధికారులనూ ఆందోళనకు గురిచేసింది. విజయనగరంజిల్లా పూసపాటిరేగ మండలం కొప్పెర్ల గురుకుల పాఠశాలలో జరిగిన ఈ ఘటనలో... అసలేమైంది?

కుక్కర్​ను పల్లెంతో కొట్టాడు... గాయాలపాలయ్యాడు
కుక్కర్​ను పల్లెంతో కొట్టాడు... గాయాలపాలయ్యాడు

By

Published : Mar 25, 2021, 7:45 PM IST

విజయనగరం జిల్లా కొప్పెర్ల గురుకుల పాఠశాలలో ప్రేమ్ కుమార్ తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. వసతిగృహంలోని భోజనశాల నుంచి బయటకొస్తూ... సరదాగా వంట గదిలోని కుక్కర్​ను పళ్లెంతో కొట్టాడు. అప్పటికే... ఉడికిన పప్పును చల్లార్చేందుకు కిందపెట్టిన కుక్కర్ మూత... పళ్లెం తాకి పైకి ఎగిసి పడింది. కుక్కర్​లోని పప్పు, వేడినీళ్లు ఒక్కసారిగా ప్రేమ్ కుమార్​పై పడ్డాయి.

ఈ ప్రమాదంలో విద్యార్థి శరీరమంతా బొబ్బలు వచ్చాయి. అప్రమత్తమైన గురుకుల పాఠశాల సిబ్బంది హుటాహుటిన భోగాపురం ప్రభుత్వం ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం... పరిస్థితి విషమంగా ఉండటంతో విజయనగరం జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై తల్లిదండ్రులు, సిబ్బంది విచారం వ్యక్తం చేస్తున్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details