విజయనగరం జిల్లా భోగాపురం తహసీల్దార్ కార్యాలయం ఎదుట బంగారు కొండ అనే వ్యక్తి కుటుంబంతో సహ నిరసన చేపట్టాడు. తమను రేషన్ కార్డుతో సహా అమ్మ ఒడి పథకానికి అనర్హులను చేశారంటూ ఆందోళన చేపట్టాడు. తక్షణమే ప్రభుత్వ పథకాలకు అర్హుల జాబితాలో చేర్చాలని కోరాడు. లేకపోతే పెట్రోల్ పోసుకోని సజీవదహనం చేసుకుంటానంటూ అధికారులను హెచ్చరించాడు. స్పందించిన తహసీల్దార్ బాధితుల వద్దకు వచ్చి ఎలాంటి ఆందోళన చెందవద్దని... త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
"అర్హుల జాబితాలో చేర్చండి...లేదంటే సజీవదహనం చేసుకుంటా" - విజయనగరం ముఖ్యంశాలు
విజయనగరం జిల్లా భోగాపురం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఓ వ్యక్తి తన కుటుంబంతో కలిసి నిరసన చేపట్టాడు. పూట గడవని తమకు మూడు ఎకరాలు భూమి ఉందంటూ రేషన్ కార్డు, అమ్మ ఒడి పథకానికి అనర్హులను చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.
నిరసన చేపట్టిన బంగారు కొండ కుటుంబం