విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గం కోమరాడ మండలం కొండ కోనేరు గ్రామంలో చేతబడి నెపంతో ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. స్థానికుల కథనం ప్రకారం.. మండలంలో 2 రోజుల క్రితం కోనేరుకు చెందిన చిన్న పాప చనిపోయింది. కొండబర్రి సింగన్న అనే వ్యక్తి చేతబడి చేశాడని ఆరోపిస్తూ.. అతనిపై పాప కుటుంబీకులు దాడి చేశారు. తీవ్ర గాయాలపాలైన సింగన్న.. చికిత్స పొందుతూ కూనేరు రామభద్రపురం ఆసుపత్రిలో చనిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.
చేతబడి నెపంతో దాడి.. వ్యక్తి మృతి - శ్రీకాకుళంలో వ్యక్తి దారుణ హత్య
విజయనగరం జిల్లా కొమరాడలోని ఓ వ్యక్తి మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. చిల్లంగి చేసి తన పాపని చంపేశాడంటూ కుటుంబీకులు చేసిన గాయాల కారణంగా.. ఆ వ్యక్తి మృతి కలకలం సృష్టిస్తోంది.
చేతబడి చేశాడంటూ దాడి.. వ్యక్తి మృతి!