విజయనగరం జిల్లా చీపురుపల్లి బ్రిడ్జ్‌టౌన్ వద్ద నడుస్తున్న వ్యక్తిని ద్విచక్రవాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బాధితుడిని ఆసుపత్రికి తరలిస్తుండగా... మార్గ మధ్యలోనే మృతి చెందాడు. మృతుడు సుంకరి మురళి కృష్ణ(54)గా పోలీసులు గుర్తించారు. బంధువుల ఫిర్యాదు మేరకు చీపురుపల్లి ఎస్సై దుర్గా ప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
చీపురుపల్లి బ్రిడ్జ్‌టౌన్ వద్ద ద్విచక్రవాహనం ఢీకొని వ్యక్తి మృతి - చీపురుపల్లి తాజా ప్రమాదం వార్తలు
విజయనగరం జిల్లా చీపురుపల్లి ప్రధాన రహదారిలో ఉన్న బ్రిడ్జ్‌టౌన్ వద్ద ద్విచక్రవాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

మరణించిన వ్యక్తి పాత చిత్రం