ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బొబ్బిలిలో అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి - బొబ్బిలిలో అనుమానాస్పదస్థితిలో మహిళ మృతి

విజయనగరం జిల్లా బొబ్బిలిలో ఓ వివాహిత.. అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు.. హత్యా..? లేక ఆత్మహత్యా? అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు.

a women suspected death at bobbili
అనుమానాస్పదస్థితిలో వివాహిత మృతి

By

Published : Mar 30, 2021, 4:14 PM IST

బొబ్బిలిలోని పూలబాగ్ కూడలిలో నివాసముంటున్న వివాహిత గేదిల స్వాతి అనుమానాస్పదంగా మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేశారు. భర్త జోగి నాయుడు హతమార్చి ఉంటాడని మృతురాలి బంధువులు ఆరోపించారు. ఆత్మహత్య చేసుకొని ఉంటుందని ఆమె భర్త.. పోలీసులకు తెలిపినట్లు సమాచారం. అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గేదిల స్వాతి - జోగి నాయుడు దంపతులు పూలబాగ్​ కూడలిలో నివాసం ఉన్నారు. జోగినాయుడు లారీ డ్రైవర్. వాళ్లకు ఇద్దరు పిల్లలు.

కొద్ది రోజులుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నట్లు స్వాతి కుటుంబీకులు చెప్పారు. ఇటీవల పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. వివరాలన్నీ పోలీసులు నమోదు చేసుకున్నారు. ఎస్సైలు ప్రసాదరావు, చదలవాడ సత్యనారాయణ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. లారీ డ్రైవర్​గా పని చేస్తున్న జోగి నాయుడు ప్రవర్తనపైనా ఆరా తీస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details