విజయనగరం జిల్లా సాలూరు పట్టణంలో విషాదకర ఘటన జరిగింది. మెట్టినింట్లో వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య చేసుకుంది. సాలూరులో 16 ఏళ్ల బాలికను అదే పట్టణంలోని కొంకివీధికి చెందిన ఆమె మేనమామ హరిపాపారావుతో ఈ ఏడాది జనవరి నెలలో వివాహం జరిపించారు.
ఆమె భర్త వ్యవసాయం, ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్నాడు. అత్తగారింట్లో ఆమెకు వేధింపులు ఎదురయ్యాయి. అత్త తనను వేధిస్తోందని బాలిక తన భర్తకు చెప్పినా పట్టించుకోలేదు. మనస్థాపానికి గురైన బాధితురాలు... ఆదివారం తన బెడ్రూంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందని సాలూరు పట్టణ ఎస్సై సింహాద్రి నాయుడు వెల్లడించారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.