ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భార్యకు కరోనా..తెలిసినవారు హేళన...అవమానంతో భర్త ఆత్మహత్య! - పార్వతీపురం లేటెస్ట్ వార్తలు

ఇంట్లో భార్యకు కరోనా పాజిటివ్... వీధిలోకి వెళ్తే సూటిపోటి మాటలతో అవమానం. ఇలాంటి పరిస్థితిని జీర్ణించుకోలేని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన పార్వతీపురంలో చోటు చేసుకుంది.

vizianagaram district
భార్యకు కరోనాపై తెలిసినవారు అపహేళన... అవమానంతో భర్త ఆత్మహత్య

By

Published : Jul 27, 2020, 6:38 PM IST

విజయనగరం జిల్లా పార్వతీపురం ప్రాంతానికి చెందిన వ్యక్తి రైలు కింద తలపెట్టి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య ఆశ వర్కర్ గా పని చేస్తోంది. ఆమెకు కరోనా సోకగా...ప్రస్తుతం హోం ఐసోలేషన్​లో ఉంటోంది. భర్త భాస్కర్ రావు ఎక్కడికి వెళ్లినా తెలిసిన వారు భార్య గురించి అవమానకరంగా మాట్లాడుతున్నట్లు మూడు రోజుల క్రితం భాస్కర్ రావు చెప్పినట్లు మృతుడి భార్య, సహోద్యోగులు తెలిపారు. అవమానం భరించలేక ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని అంటున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తోన్న పోలీసులు... ఇది ఆత్మహత్యనా లేక ప్రమాద వశాత్తు రైలు కింద పడి ఉంటాడా అనే కోణంలో విచారిస్తున్నట్లు తెలిపారు. మృతుడికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.

ఇవీ చూడండి-దారుణం... చెత్త బండిలో కరోనా అనుమానితుడి తరలింపు

ABOUT THE AUTHOR

...view details