సెల్ఫీ సరదా ఓ యువకుని నిండు ప్రాణాన్ని బలిగొంది. విజయనగరం జిల్లా లక్కవరపుకోట స్టేషన్‌లో గూడ్స్ బోగీపై ప్రశాంత్ అనే యువకుడు స్నేహితులతో కలిసి సెల్ఫీ తీసుకుంటూ విద్యుదాఘాతానికి గురయ్యాడు. సోమవారం సాయంత్రం ఈ ఘటన జరగ్గా.. తీవ్ర గాయాలపాలైన యువకుణ్ని విశాఖ కేజీహెచ్ ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ ఇవాళ మధ్యాహ్నం మృతి చెందాడు. ప్రశాంత్ ఇంజినీరింగ్ ఆఖరి సంవత్సరం చదువుతున్నాడు.
గూడ్స్ బోగీపై యువకుని సెల్ఫీ.. విద్యుత్ షాక్తో మృతి
సెల్ఫీ సరదా ప్రాణం తీసింది
15:19 June 02
సెల్ఫీ సరదా ప్రాణం తీసింది
Last Updated : Jun 2, 2020, 4:09 PM IST