ఉరి వేసుకుని ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన విజయనగరం జిల్లా గౌరిపురం గ్రామ సమీపంలో సోమవారం చోటు చేసుకుంది. మృతిచెందిన వ్యక్తి శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం గ్రామానికి చెందిన రేజేటి వసంత్(35)గా పోలీసులు గుర్తించారు. సోమవారం ఉదయం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఆ వ్యక్తి గౌరిపురం గ్రామ సమీపంలోని ఓ చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డినట్లు స్థానిక ఎస్సై శివప్రసాద్ తెలిపారు. మృతదేహాన్ని పార్వతీపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఎస్సై తెలిపారు. అతని కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చి, కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.
చెట్టుకు ఉరివేసుకుని వ్యక్తి ఆత్మహత్య - man hang to tree in gowripuram latest news
జియ్యమ్మవలస మండలం గౌరిపురం గ్రామ సమీపంలో ఓ వ్యక్తి చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని పార్వతీపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై శివప్రసాద్ తెలిపారు.
గౌరీపురం గ్రామ సమీపంలో వ్యక్తి మృతి