ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పంటలను నాశనం చేస్తున్న ఏనుగుల గుంపు - విజయనగరం జిల్లాలో ఏనుగుల గుంపు వార్తలు

విజయనగరం జిల్లా గరుగుబిల్లి మండలంలో అడవి ఏనుగుల సంచారం కలకలం రేపుతోంది. ఏనుగుల గుంపు ఖడ్గవలస, పిట్టలమెట్టలో... వరి, అరటి, చెరకు తోటలను ధ్వంసం చేశాయి. గజరాజులతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

A herd of elephants destroying crops at garugubilli in Vijayanagaram district
A herd of elephants destroying crops at garugubilli in Vijayanagaram district

By

Published : Jun 2, 2020, 11:39 AM IST

విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గంలోని గరుగుబిల్లి మండలం ఖడ్గవలస, పిట్టలమెట్ట ప్రాంతాల్లో అడవి ఏనుగుల గుంపు సంచరిస్తోంది. అరటి, చెరుకు, వరి పంటలను గజరాజులు ధ్వంసం చేస్తున్నాయి. ఎక్కువ మోతాదులో పంట నష్టం జరిగినా... అటవీశాఖ అధికారులు పట్టించుకోవడంలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేతికొచ్చిన పంటను ఏనుగులు నాశనం చేస్తున్నాయని రైతులు వాపోతున్నారు. కల్లంలో ఉంచిన ధాన్యం బస్తాలను అరగించాయని ఆవేదన చెందుతున్నారు. అధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details