ఇంటర్ ద్వితీయ ఏడాది ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ చూపిన విజయనగరం జిల్లా పార్వతీపురం మండలం పుత్తూరుకు చెందిన విద్యార్థినులు నీలిమ, కల్పన.. తల్లిదండ్రులను కళాశాల యాజమాన్యం ఘనంగా సన్మానించారు. సాధారణ వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వీరు చదువులో అద్భుతంగా రాణిస్తున్నారు. బైపీసీ విభాగంలో నీలిమ 9.87 గ్రేస్ పాయింట్లు, ఎంపీసీలో కల్పన 9.5 పాయింట్లు సాధించింది. విద్యార్థినులు మంచి ప్రతిభ చూపడంలో తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎంతో ఉందని కళాశాల కరస్పాండెంట్ పూడి రామకృష్ణ కొనియాడారు. వారికి చిరు కానుకలు అందించి సత్కరించారు.
ప్రతిభ చూపిన విద్యార్థినుల తల్లిదండ్రులకు ఘన సన్మానం - vizianagaram district news updates
సాధారణ వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి ఇంటర్ ద్వితీయ ఏడాది ఫలితాల్లో ప్రతిభ చూపిన విద్యార్థినుల తల్లిదండ్రులను కళాశాల యాజమాన్యం ఘనంగా సత్కరించింది. ఈ ఘటన విజయనగరం జిల్లా పార్వతీపురంలో జరిగింది.
ప్రతిభ కనబరిచిన విద్యార్థినుల తల్లిదండ్రులకు ఘన సన్మానం