మహిమ గల చెంబు పేరుతో పలువురిని మోసం చేస్తున్న ముఠా పోలీసులకు పట్టుబడింది. విజయనగరం జిల్లా నెల్లిమర్ల సమీప ప్రాంతంలో అద్భుత శక్తులు ఉన్న పురాతన వస్తువులు అని... ఓ ముఠా మాయ మాటలు చెప్పి స్థానికులను మోసగిస్తుందని డీఎస్పీ అనిల్ కుమార్ తెలిపారు. దీనిపై ఫిర్యాదులు రావటంతో ప్రత్యేక టీం నిఘా పెట్టి నలుగురిని అదుపులోకి తీసుకున్నామని వెల్లడించారు. అలాగే పరారీలో ఉన్న ఆసామీ గురించి గాలింపు చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. నిందితుల నుంచి రూ.3 లక్షలు, 4 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.
మహిమ గల చెంబు పేరుతో మోసాలు.. ముఠా అరెస్ట్ - విజయనగరంలో తాజా నేర వార్త
అద్భుత శక్తులు ఉన్న చెంబు పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ వస్తువులను పురాతన వస్తువులుగా చూపుతూ... కొంతమంది ప్రజలను మోసగించి సొమ్ము చేసుకుంటున్నారు. వీరిపై ఫిర్యాదులు రావడం వల్ల ప్రత్యేక టీం నిఘా పెట్టి నిందితులను అరెస్ట్ చేశారు.
మహిమ గల చెంబు పేరుతో మోసాలు.. ముఠా అరెస్ట్