విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణం తారకరామ కాలనీ సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది. బొబ్బిలి నుంచి పార్వతీపురం వైపు వెళ్తున్న బైక్..ఆగి ఉన్న లారీని బలంగా ఢీకొట్టింది. దాంతో బైక్పై ఉన్న దివ్వెల శీను అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. అతని కుమారుడు, భార్య తీవ్రంగా గాయపడ్డారు. వీరిద్దరిని బొబ్బిలి ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. కుమారుడు మణికంఠ పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Accident: ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన బైక్, తండ్రి మృతి..కుమారుడి పరిస్థితి విషమం - లారీని ఢీ కొట్టిన బైక్
విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణంలో ఘోర ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని బైక్ ఢీ కొట్టడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. అతని భార్య, కుమారుడు తీవ్రంగా గాయపడ్డారు.
రోడ్డు ప్రమాదం
మృతుడిది పార్వతీపురం మండలం నరసాపురం గ్రామం. అత్తవారు బలిజిపేట మండలం గంగాడ వెళ్లి వస్తుండగా తిరుగు ప్రయాణంలో ఈ దుర్ఘటన జరిగింది.
ఇదీ చదవండి:Accident: ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు.. ఇద్దరు మృతి