విజయనగరం జిల్లా పార్వతీపురం పురపాలక సంఘం చర్చి వీధిలో గ్రంథాలయం పక్కన భారీ వృక్షం నేలకూలింది. ఈ క్రమంలో విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడం వల్ల పెద్ద ప్రమాదం తప్పింది. పలు ప్రాంతాలకు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. విద్యుత్ సిబ్బంది మరమ్మతు చర్యలు చేపట్టారు.
పార్వతీపురంలో కూలిన చెట్టు ..తప్పిన ప్రమాదం
విజయనగరం జిల్లా పార్వతీపురంలో జనసంచారం ఉండే మార్గంలో వృక్షం నేలకూలింది. ఆ సమయంలో ఆ ప్రాంతంలో ఎవరూ లేకపోవడం వల్ల ప్రమాదం తప్పింది.
పార్వతీపురంలో కూలిన చెట్టు