మూడు రాజధానులపై ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూ... విజయనగరం జిల్లా కోట జంక్షన్ వద్ద సంతకాల సేకరణ చేపట్టారు. వైకాపా యువజన విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని... ఆ పార్టీ నాయకుడు మామిడి అప్పలనాయుడు ప్రారంభించారు. పరిపాలన, అభివృద్ధి, అధికారం, రాజకీయ వికేంద్రీకరణతోనే... రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల వారికి సమన్యాయం జరుగుతుందని అభిప్రాయపడ్డారు. ఒకే ప్రాంతం అభివృద్ధితో ఇప్పటికే మద్రాస్, హైదరాబాద్లని కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. మరోసారి విభజన సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే అభివృద్ధి వికేంద్రీకరణ ఒక్కటే మార్గమన్నారు. సీఎం జగన్ తీసుకున్న ఈ నిర్ణయానికి... పార్టీలకతీతంగా అందరూ సహకరించాలని కోరారు.
మూడు రాజధానులకు మద్దతుగా... విజయనగరంలో సంతకాల సేకరణ - a collection of signatures for supporting of 3 capitals in ap
మూడు రాజధానులకు మద్దతుగా... కోట జంక్షన్ వద్ద వైకాపా నాయకులు సంతకాల సేకరణ చేపట్టారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, వైకాపా నేతలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
మూడు రాజధానుల మద్దతుగా... విజయనగరంలో సంతకాల సేకరణ