విజయనగరం జిల్లా పార్వతీపురం మండలం మరికి గ్రామానికి చెందిన బి.లావణ్య ప్రాంతీయ ఆసుపత్రిలో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. శిశువు కాళ్లు, చేతులకు ఆరు వేళ్ళు చొప్పున ఉన్నాయి. బిడ్డకు మొత్తం 24 వేళ్లు ఉన్నాయని... జన్యుపరమైన కారణాలతోనే ఇలా జరుగుతుందని ఆసుపత్రి సూపరింటెండెంట్తెలిపారు. శిశువు మేనత్తకు 24 వేళ్ళు ఉన్నాయని కుటుంబీకులు తెలిపారు.
విజయనగరం జిల్లాలో ఆ శిశువుకు 24 వేళ్లు - A baby born with 24 fingers
మనిషికి సాధారణంగా చేతులకు, కాళ్లకు కలిపి మొత్తం 20 వేళ్లు ఉంటాయి. కొందరికైతే కాలికో, వేలికో ఐదింటితో పాటు ఒక వేలు ఎక్కువగా ఉంటుంది. కానీ విజయనగరం జిల్లా పార్వతీపురం మండలంలో జన్మించిన ఈ శిశువుకు మాత్రం కాళ్లు, చేతులకు కలిపి మొత్తం 24 వేళ్లు ఉన్నాయి.
విజయనగరం జిల్లాలో వింత...24 వేళ్ళతో పుట్టిన శిశువు