విజయనగరం జిల్లా ఎస్.కోట మండలం బొడ్డవర చెక్ పోస్ట్ సమీపంలో కారులో 90కిలోల గంజాయిని (90kgs Ganja Seized) ఎస్.కోట పోలీసులు పట్టుకున్నారు. పోలీసుల సమాచారం ప్రకారం చెక్ పోస్ట్ సమీపంలో రోడ్డు పక్కన ఆపి ఉన్న కారును స్థానికులు గమనించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన ఖాకీలు తనిఖీ చేపట్టారు.
పోలీసులను చూసి.. కారు వదిలేసి.. - Police checks at Boddavara check post
పోలీసుల కళ్లుగప్పి సరఫరా చేద్దామనుకున్నారో..ఎవరూ గమనించరనుకున్నారో గానీ దర్జాగా కారులో గంజాయిని తరలించేస్తున్నారు. చెక్ పోస్టు వద్ద ఖాకీల తనిఖీలు చూసి భయపడి వాహనాన్ని అక్కడే వదిలి పరారయ్యారు. దగ్గరకి వెళ్లి చూస్తే కారులో 90కిలోల గంజాయిని గుర్తించిన పోలీసులు.. స్వాధీనం (90kgs Ganja Seized) చేసుకున్నారు. ఈ ఘటన విజయనగరం జిల్లా ఎస్.కోట మండలం బొడ్డవర చెక్ పోస్ట్ సమీపంలో జరిగింది.

కారులో తరలిస్తున్న 90కేజీల గంజాయి స్వాధీనం
కారులో 90కిలోల గంజాయి ఉన్నట్లు వారు గుర్తించారు. అయితే కారులో మాత్రం ఎవరూ లేరన్నారు. గంజాయిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశామని ఎస్ఐ లోవరాజు తెలిపారు. గంజాయి విలువ సూమారు రూ. నాలుగు లక్షల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. విశాఖ ఏజెన్సీ నుంచి గంజాయి తీసుకు వస్తూ చెక్ పోస్ట్ వద్ద పోలీసులు సోదాలు చేస్తుండడం చూసి భయపడి.. కారు వదిలేసి రవాణా చేస్తున్న వారు పారిపోయి ఉంటారని భావిస్తున్నారు.
ఇదీ చదవండి : ఆర్టీసీ బస్సులో గంజాయి రవాణా.. ఇద్దరి పట్టివేత