ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

EMPLOYEES PROTEST : కొత్త పీఆర్సీపై ఆందోళన.. నిరసనలో పాల్గొన్న 90 ఏళ్ల విశ్రాంతి ఉద్యోగి - PRC

పీఆర్సీకి వ్యతిరేకంగా విజయనగరంలో ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. ఈ నిరసనల్లో 90 ఏళ్ల విశ్రాంత ఉద్యోగి పాల్గొన్నారు. ఉద్యోగులు పోరాడితేనే సమస్యలను పరిష్కరించకోగలమని వెల్లడించారు.

నిరసనలో పాల్గొన్న 90 ఏళ్ల విశ్రాంతి ఉద్యోగి
నిరసనలో పాల్గొన్న 90 ఏళ్ల విశ్రాంతి ఉద్యోగి

By

Published : Jan 24, 2022, 12:30 PM IST

పీఆర్సీపై ఉద్యోగులు, పింఛన్‌దారుల ఆందోళన ఉద్ధృతంగా సాగుతోంది. విజయనగరంలో నిర్వహించిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో 90 ఏళ్ల విశ్రాంత ఉద్యోగి సోమయాజుల వెంకట సుబ్బారావు పాల్గొన్నారు. తాను ఎన్నో పీఆర్సీలు చూశానని, ఎంతో మంది ముఖ్యమంత్రుల హయాంలో పనిచేశానన్న సుబ్బారావు ఏనాడు ఇలాంటి పరిస్థితులు ఎదురుకాలేదన్నారు. ఉద్యోగులు పోరాడితేనే సమస్యలను పరిష్కరించకోగలమంటూ వారిలో ఉత్సాహం నింపారు.

నిరసనలో పాల్గొన్న 90 ఏళ్ల విశ్రాంతి ఉద్యోగి

ABOUT THE AUTHOR

...view details