ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Tourist Bus Accident : ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన బస్సు.. 9మందికి తీవ్ర గాయాలు.. - నాతవలస జాతీయ రహదారి టోల్‌గేట్‌

Lorry and bus crash: విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గం నాతవలస జాతీయ రహదారి టోల్ గేట్ సమీపంలో ఆగి ఉన్న లారీని యాత్రికుల బస్సు ఢీ కొట్టింది. ఈ ఘటనలో 9మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.

Tourist Bus Accident
ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన బస్సు...9మందికి తీవ్ర గాయాలు..

By

Published : Jan 21, 2022, 2:12 PM IST

Tourist Bus Accident At Toll gate: విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గం నాతవలస వద్ద జాతీయ రహదారి టోల్‌గేట్‌ సమీపంలో యాత్రికుల బస్సు.. ఆగి ఉన్న లారీని ఢీ కొట్టింది. ఈ ఘటనలో మొత్తం 9 మంది గాయపడ్డారు. వీరిలో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉంది. మహారాష్ట్ర నుంచి తిరుపతికి 48 మంది యాత్రికులతో వెళ్తున్న బస్సు.. తెల్లవారుజామున లారీని ఢీకొంది. బస్సు ముందు భాగం బాగా దెబ్బతింది. ప్రమాదం జరిగాక చాలా సేపటి వరకూ ఎవరూ స్పందించలేదని.. ప్రయాణికులు వాపోయారు.

ABOUT THE AUTHOR

...view details