ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సుమారు రూ. 60 లక్షల విలువైన గంజాయి పట్టివేత - విజయనగరం జిల్లాలో గంజాయి పట్టివేత

లారీ​లో గోనెసంచుల మాటున గంజాయి తరలిస్తున్న ముఠాను ఎస్.కోట పోలీసులు పట్టుకున్నారు. దీని విలువ సుమారు రూ. 60 లక్షలు ఉంటుందని విజయనగరం జిల్లా ఎస్పీ రాజకుమారి వెల్లడించారు.

50 bags ganja seized in vizianagaram
సుమారు రూ. 60 లక్షల విలువైన గంజాయి పట్టివేత

By

Published : Nov 14, 2020, 6:27 PM IST

విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం ముష్టిపల్లి కూడలి వద్ద ఓ ఐచర్ వ్యాన్​లో గోనెసంచుల మాటున గంజాయి తరలిస్తున్న ముఠాను ఎస్.కోట పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసుకు సబంధించిన పూర్తి వివరాలను జిల్లా ఎస్పీ రాజకుమారి వెల్లడించారు. ముందస్తు సమాచారం మేరకు ఈ సాయత్రం ముష్టిపల్లి కూడలి వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. గోనె సంచులతో వెళ్తున్న ఐచర్ వ్యాన్(లారీ)లో 50 గంజాయి బస్తాలు గుర్తించారు. దాని విలువ సుమారు రూ.60 లక్షలు ఉంటుందన్నారు. ఈ కేసులో పాత్రధారులైన నర్సీపట్నం ప్రాంతానికి చెందిన ఇద్దరు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్ చేశామని.. మరో నలుగురు పరారీలో ఉన్నట్లు తెలిపారు. 50 సంచుల గంజాయి, లారీ ఐచర్ వ్యాన్, ఒక సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు.


ఎక్కనుంచి ఎక్కడికి...

జిల్లాలో ముంచంగిపుట్టు మండలం పరిసరాల నుంచి ఈ గంజాయి కొనుగోలు చేసి ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి తరలించడానికి ఏర్పాటు చేస్తున్నట్లు విచారణలో తెలింది. అరకు ప్రాంతం నుంచి శృంగవరపుకోట మీదుగా జాతీయ రహదారికి మార్గం ఉండటంవల్ల ఈ దారిలో ఎక్కువగా గంజాయి రవాణా జరుగుతుంది. శృంగవరపుకోట పోలీసులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ.. అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేస్తున్నారు. ఈ ఏడాదిలో మొత్తం 21 కేసుల్లో 1840 కిలోల గంజాయి పట్టుబడింది.

పిల్లలపై దృష్టి పెట్టాలి...

విద్యార్థులు, యువకులు అరకు వచ్చే అక్కనుంచి చిన్న మొత్తంలో గంజాయి తరలిస్తూ.. దాని బారిన పడుతున్నారు. ఈ క్రమంలో తల్లిదండ్రులు పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఎస్పీ సూచించారు. ఈ సమావేశంలో విజయనగరం డీఎస్సీ వీరాంజనేయ రెడ్డి, సీఐ బి. శ్రీనివాసరావు, ఎస్సై నీలకంఠం పాల్గొన్నారు.

ఇదీ చదవండి:
స్వామీజీలకు ప్రభుత్వం లొంగిపోయిందా..?: సీపీఐ రామకృష్ణ

ABOUT THE AUTHOR

...view details