విజయనగరం జిల్లా మెరకముడిదం మండలం గరుగుబిల్లి పరిధిలో గల నాటుసారా స్థావరాలపై చీపురుపల్లి స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెట్ బ్యూరో అధికారులు మెరుపు దాడి నిర్వహించారు. సుమారు 2500 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఇన్స్‌స్పెక్టర్ ఉమామహేశ్వర రావు హెచ్చరించారు.
కర్నూలు జిల్లాలో..
కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ ఎక్సైజ్ పోలీసులు నాటు సారా బట్టీలు ధ్వంసం చేశారు. సిరివల్ల మండలం మహాదేవపురం పరిధిలోని నల్లమల అటవీ ప్రాంతంలో విస్తృతంగా సోదాలు నిర్వహించారు. అటవీ పరిధిలో 1800 లీటర్ల నాటుసారా ఊటను ధ్వంసం చేశారు. నాటుసారాను అరికట్టేందుకు తాము ప్రత్యేక దాడులు నిర్వహిస్తున్నామని ఎక్సైజ్ ఇన్స్‌స్పెక్టర్ విజయ్ కుమార్ తెలిపారు.
ఇదీ చదవండి:
తప్పని తిప్పలు... డోలిలో ఆసుపత్రికి గర్భిణి