ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'మంత్రి బొత్స సోదరుడు మా భూములు కబ్జా చేశారు' - బొత్స ఆదినారాయణపై ఫిర్యాదు

బొత్స సత్యనారాయణ సోదరుడిపై 40 కుటుంబాలు స్పందనలో ఫిర్యాదు చేశాయి. తమ స్థలాన్ని మంత్రి సోదరుడు ఆక్రమించి... చుట్టూ గోడ కట్టారని ఆరోపించాయి.

40 families have complaint against Botsha Satyanarayana's brother in spandana program
బాధితులు

By

Published : Dec 23, 2019, 8:28 PM IST

బొత్స సోదరుడిపై ఫిర్యాదు

రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ సోదరుడు బొత్స ఆదిబాబు... విజయనగరంలో తమ నివాస స్థలాలను అక్రమించారంటూ బాధితులు కలెక్టరేట్​లో నిర్వహించిన స్పందనలో ఫిర్యాదు చేశారు. బొత్స ఆదిబాబు నివసిస్తున్న ప్రదీప్ నగర్​లోని సత్యసాయి నగర్ లేఔట్​లో సుమారు 40 కుటుంబాలకు చెందిన ఇంటి స్థలాలను ఆక్రమించినట్లు బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు. తమకు అన్ని పత్రాలు, అనుమతులు ఉన్నా అక్రమంగా తమ స్థలా​ల చుట్టూ ఆయన ప్రహరీ నిర్మించారంటూ బాధితులు అధికారుల ముందు వాపోయారు. సత్య సాయినగర్​లోని సర్వే నెంబర్ 53/4, 53/5 లేఅవుట్​లో పంచాయతీ అనుమతులు, రెవెన్యూ అనుమతులు ఉన్నాయని వెల్లడించారు. అయినప్పటికీ ఆదిబాబు తమవంటూ ఆక్రమించారని... 40కుటుంబాలు విచారం వ్యక్తం చేశాయి. అధికారులు విచారణ చేపట్టి... తమ స్థలాలు తమకు ఇప్పించాలంటూ స్పందనలో సంయుక్త కలెక్టర్ వెంకట రమణారెడ్డికి విన్నవించుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details