విజయనగరం జిల్లాలో కరోనా వైరస్ నుంచి కోలుకున్న నలుగురు... జిల్లా కొవిడి ఆసుపత్రి మిమ్స్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. వారికి ఆసుపత్రి సిబ్బందితో పాటు... కలెక్టర్ హరి జవహర్ లాల్, ఎస్పీ రాజకుమారి, జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారిణి రమణ కుమారి, విజయనగరం శాసనసభ్యుడు వీరభద్రస్వామి పుష్పగుచ్చాలు అందచేశారు. అభినందనలు తెలియచేశారు.
ఒక్కో బాధితునికి రాష్ట్ర ప్రభుత్వం తరపున 2 వేల రూపాయల నగదు, పండ్లు, శానిటైజర్, మాస్క్ అందజేశారు. అనంతరం కరతాళ ధ్వనులతో వారికి వీడ్కోలు పలికారు. కరోనా బాధితులకు చికిత్స అందించిన డా. సుబ్రహ్మణ్య హరికిషన్ నేతృత్వంలోని వైద్యులు, నర్సుల బృందాన్ని సైతం అధికారులు, ప్రజాప్రతినిధులు అభినందించారు.