39వ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మహాసభలు విజయనగరంలోని ఎస్ కన్వెన్షన్ హాలులో నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఎమ్మెల్సీ మాధవ్ పాల్గొని.. జనమంచి గౌరీ శంకర్ 20-21 యువ పురష్కార్ అవార్డులను అందజేశారు. రాష్ట్రంలో ఏబీవీపీ ఈ స్థాయికి ఎదగడానికి ముఖ్య కారణం జనమంచి గౌరీ శంకర్ అని కొనియాడారు. ఆయన అనేక కార్యక్రమాలు చేసి, ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారన్నారు. ఆయన పేరు మీద ప్రతి సంవత్సరం స్మారక యువ పురస్కారం ఇవ్వడం జరుగుతుందని వివరించారు.
39వ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మహాసభలు - ఎమ్మెల్సీ మాధవ్ తాజా వ్యాఖ్యలు
విజయనగరంలోని ఎస్ కన్వెన్షన్ హాలులో 39వ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మహాసభలు జరిపారు. ఎమ్మెల్సీ మాధవ్ ముఖ్య అతిథిగా పాల్గొని జనమంచి గౌరీ శంకర్ 20-21 యువ పురష్కార్ అవార్డులను అందజేశారు.
అవార్డు అందజేస్తున్న ఎమ్మెల్సీ మాధవ్
ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ.. అందరికీ స్పూర్తిగా నిలిచిన వెంకట్‌కు ఈ అవార్డు ఇవ్వటం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో భాజపా జిల్లా అధ్యక్షురాలు రెడ్డి పావని, ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి కౌశిక్, జిల్లా కార్యదర్శి హునూక్, ఏబీవీపీ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి...