ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మాస్క్​, చొక్కా సహాయంతో యువకుడు బలవన్మరణం - పూసపాటిరేగ తాజా వార్తలు

పూసపాటిరేగ మండలానికి చెందిన పంకజ్​ శ్రీనివాస్​ అనే యువకుడు మాస్క్​, చొక్కాను ఉరితాడుగా బిగించుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనా స్థలాన్ని సందర్శించారు.

24 year old guy suicide with the help of mask and shirt in vijayanagaram district
ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న పంకజ్​ శ్రీనివాస్​

By

Published : Jun 30, 2020, 2:08 PM IST

విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలంలో మాస్క్​, చొక్కా సాయంతో ఓ యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మరణించిన వ్యక్తి బాబమెట్ట ప్రాంతానికి చెందిన పంకజ్​ శ్రీనివాస్​ మిశ్రా (24)గా పోలీసులు గుర్తించారు. శ్రీనివాస్​ ఎంటెక్​ పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాడు. మృతుడి తండ్రి నాగేంద్ర కుమార్​ ప్రధాన ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు.

ఉద్యోగం రాలేదనే మనస్థాపం చెందిన శ్రీనివాస్ పైప్​లైన్​కు మాస్కు సహాయంతో చొక్కా చుట్టుకుని ఉరి వేసుకున్నాడు. తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై బాలాజీరావు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details