అబ్కారీ శాఖ సమాచారం మేరకు విజయనగరం జిల్లా పాచిపెంట మండల పోలీసులు భారీగా గుట్కా,కైనీ ప్యాకెట్లు సీజ్ చేశారు. పి.కోన వలస చెక్ పోస్ట్ దగ్గర చేపట్టగా బొలోరా వాహనంలో భారీగా మొత్తంలో తరలిస్తున్న కైనీ, గుట్కా ప్యాకెట్లు పట్టుబడ్డాయి. వీటి విలువ సుమారు 2లక్షల 80వేల నాలుగు వందలు ఉంటుందని అంచనా. వాహనాన్ని సీజ్ చేసిన పోలీసులు శ్రీకాకుళానికి చెందిన ఇద్దరిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు పాచిపెంట ఎస్ఐ గంగరాజు తెలిపారు.
పాచిపెంటలో 2.8 లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లు స్వాధీనం - 2.8 lakh worth of Kaini and Gutka packets seized in Pachipenta
విజయనగరం జిల్లా పాచిపెంట మండలంలో 2.8లక్షల విలువైన కైనీ, గుట్కా ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అబ్కారీ శాఖ సూచన ప్రకారం పోలీసులు పి.కోన వలస చెక్ పోస్ట్ దగ్గర తనిఖీ నిర్వహించారు. ఈ సోదాల్లో బొలెరో వాహనంలో భారీగా తరలిస్తున్న కైని, గుట్కా ప్యాకెట్లను వారు స్వాధీనం చేసుకున్నారు.
పాచిపెంటలో 2.8 లక్షల విలువ గల కైనీ, గుట్కా ప్యాకెట్లు స్వాధీనం
ఈ తనిఖీల్లో వీఆర్వోలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
ఇవీ చదవండి: నాటుసారా స్థావరాలపై అధికారుల దాడులు