ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

1500 లీటర్ల నాటుసారా స్వాధీనం - గుమ్మలక్ష్మీపురంలో సారా పట్టివేత న్యూస్

విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో నాటుసారా తయారి స్థావరాలపై పోలీసులు దాడులు చేశారు. 1500 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకుని ఒకరిని అదుపులోకి తీసుకున్నట్లు ఎల్విన్ పేట సీఐ.రమేష్ కుమార్ తెలిపారు.

1500 లీటర్ల నాటుసారా స్వాధీనం
1500 లీటర్ల నాటుసారా స్వాధీనం

By

Published : Apr 29, 2020, 7:56 PM IST

నాటుసారా తయారీ స్థావరాలపై విజయనగరం జిల్లా ఎల్విన్ పేట పోలీసులు దాడులు నిర్వహించారు. జిల్లాలోని గుమ్మలక్ష్మీపురం మండలం కన్నయ్యగూడ గ్రామం సమీపంలో 1500 లీటర్ల నాటుసారాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. లాక్​డౌన్​ వల్ల ప్రభుత్వ మద్యం దుకాణాలను తెరవకపోవటంతో నాటుసారాకు బానిసలవుతున్నారని ఎల్విన్ పేట సీఐ రమేష్ కుమార్ తెలిపారు. నాటుసారాను తయారు చేసినా, అమ్మినా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

ఇదీ చూడండి:నాటుసారా తరలిస్తున్న ముఠా అరెస్ట్

ABOUT THE AUTHOR

...view details