ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తల్లి మందలించిందని బాలుడి ఆత్మహత్య - boy hanging news in pothampeta

తల్లి మందలించిందని ఇంట్లో ఉరి పోసుకుని 11 ఏళ్ల బాలుడు మృతిచెందిన ఘటన విజయనగరం జిల్లా పోతంపేటలో జరిగింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

తల్లి మందలించిందని బాలుడు ఆత్మహత్య
తల్లి మందలించిందని బాలుడు ఆత్మహత్య

By

Published : May 8, 2020, 10:11 PM IST

విజయనగరం జిల్లా లక్కవరపుకోట మండలం పోతంపేటలో విషాదం జరిగింది. తల్లి మందలించిందని 11 ఏళ్ల బాలుడు ఇంట్లో ఉరి పోసుకుని మృతిచెందాడు. స్థానిక ఎస్​ఐ ప్రయాగ మూర్తి తెలిపిన వివరాల ప్రకారం... పోతంపేట గ్రామానికి చెందిన రమాదేవికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కరోనా నేపథ్యంలో ఎండలు ఎక్కువగా ఉన్నాయని... బయటికి వెళ్లొద్దని అన్నందుకు మనస్థాపం చెందిన కుమారుడు ప్రదీప్ ఇంట్లో ఉరి పోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

రమాదేవి కుమారుడితో పాటు కూతురు హరితనూ ఇంట్లో ఉంచి తల్లి ఉపాధి హామీ పనికి వెళ్లింది. తర్వాత కూతురు తల్లి వద్దకు వెళ్లొచ్చి చూసే సరికి ప్రదీప్​ కిటికీకి ఉరిపోసుకుని ఉండటం చూసి తల్లికి సమాచారం అందించింది. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.

ఇదీ చూడండి:ఇంటి ముందు దుర్భాషలాడారని మనస్తాపంతో మహిళ ఆత్మహత్యాయత్నం

ABOUT THE AUTHOR

...view details