ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విశాఖ జిల్లాలో ప్రశాంతంగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియ - విశాఖ జిల్లాలో జడ్పీటీసీ ఎంపీటీసీ నామినేషన్లు

విశాఖ జిల్లాలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. నేడు నామపత్రాల దాఖలుకు చివరిరోజు అయినందున పెద్దఎత్తున అభ్యర్థులు నామినేషన్లు వేశారు.

zptc mptc nominations in vizag district
విశాఖ జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్లు

By

Published : Mar 11, 2020, 6:18 PM IST

విశాఖ జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో ఎంపీటీసీ నామినేషన్లు వేసేందుకు అభ్యర్థులు భారీసంఖ్యలో బారులు తీరారు. నామినేషన్ల దాఖలుకు నేడు ఆఖరిరోజు అయినందున అభ్యర్థులు పెద్దసంఖ్యలో నామపత్రాలు సమర్పించారు. వైకాపా, తెదేపా, జనసేన, భాజపా అభ్యర్థుల నుంచి నామపత్రాలు దాఖలయ్యాయి.

చోడవరం నియోజకవర్గంలో నామినేషన్ వేసే అభ్యర్థులతో ఎంపీడీవో కార్యాలయాలు సందడిగా మారాయి. కార్యాలయం వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీలకు వివిధ పార్టీల అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేశారు.

విశాఖ మన్యం పాడేరులో జెడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ ప్రక్రియ మందకొడిగా సాగింది. మన్యంలోని ఓటర్ లిస్టులో తమ పరిధిలో ఉన్న ఎపిక్ నెంబర్​ను పరిశీలించే ప్రక్రియ జరిగింది. ఈ ప్రక్రియ చేపట్టేందుకు అధిక సమయం పట్టింది.

యలమంచిలి మండలంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ నేటితో ముగిసింది. ఇక్కడ 7 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా తెదేపా, వైకాపా, జనసేన పార్టీల నుంచి 38 మంది నామినేషన్లు దాఖలయ్యాయి. మొదటి 2 రోజులు ఒక్కరు కూడా నామినేషన్ వేయలేదు.

విశాఖ జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్లు

ఇవీ చదవండి..స్థానిక సంగ్రామం: ఆ గ్రామంలో ఎన్నికల్లేవ్..ఎందుకంటే!

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details