'వ్యర్థాలపై యుద్ధం' రెండవ విడత కార్యక్రమాన్ని విశాఖ జిల్లావ్యాప్తంగా నిర్వహించనున్నట్లు జడ్పీ ముఖ్య కార్య నిర్వహకాధికారి నాగార్జున సాగర్ తెలిపారు. గ్రామాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా.. పరిసరాల పరిశుభ్రతపై ప్రజలను చైతన్యపరచడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం రూపొందించామన్నారు.
జిల్లాలోని 153 గ్రామాలలోనూ ఈ కార్యక్రమం చేపడతామని.. జడ్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నాగార్జున సాగర్ పేర్కొన్నారు. ఈ నెల 7 నుంచి 21వ తేదీ వరకు.. 15 రోజులపాటు నిర్వహిస్తామని వెల్లడించారు. తడి, పొడి చెత్తలను వేరు చేసి ఇచ్చేలా.. గ్రామస్థులను చైతన్యపరుస్తామని వివరించారు. ప్రజా ప్రతినిధులు భాగస్వాములై.. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. మొదటి రోజు జిల్లా, రెండవ రోజు మండల స్థాయిల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని అన్నారు.