తమ కమీషన్ను రూ.35 నుంచి రూ.15కి తగ్గించడాన్ని వ్యతిరేకిస్తూ విశాఖలో సీఐటీయూ ఆధ్వర్యంలో జొమాటో ఫుడ్ డెలివరీ బాయ్స్ ఆందోళన చేపట్టారు. సంస్థలో అనేక ఏళ్లుగా పనిచేస్తున్న వారికి రూ.35 చెల్లించాలని కోరుతూ జీవీఎంసీ గాంధీ పార్కులో నిరసన చేపట్టారు. కమీషన్లు తగ్గించి ఇబ్బందులకు గురి చేయడం సమంజసం కాదని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు పడాల రమణ ఆవేదన వ్యక్తం చేశారు.
విశాఖలో జొమాటో ఫుడ్ డెలివరీ బాయ్స్ ఆందోళన - విశాఖ వార్తలు
విశాఖలో జొమాటో ఫుడ్ డెలివరీ బాయ్స్ ఆందోళనకు దిగారు. సీఐటీయూ ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ పార్కులో నిరసన తెలిపారు. కమీషన్ను రూ.35 నుంచి రూ.15కి తగ్గించడంపై ఆవేదన వ్యక్తం చేశారు. పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించడంతో పాటు గుర్తింపు కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
జొమాటో ఫుడ్ డెలివరీ బాయ్స్ ఆందోళన
ఉద్యోగులకు కోత విధించవద్దని పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించడంతో పాటు గుర్తింపు కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
ఇదీ చదవండి: విశాఖ ప్రజలను వణికిస్తున్న చలి