పుర ఎన్నికలు సమీపిస్తున్న వేళ విశాఖ జిల్లా అనకాపల్లిలో వైకాపా కార్పొరేట్ అభ్యర్థులు ముమ్మర ప్రచారం చేస్తున్నారు. పట్టణంలోని 82వ వార్డులో వైకాపా కార్పొరేట్ అభ్యర్థిని మందపాటి సునీత కూరగాయలు అమ్ముతూ వినూత్నంగా ప్రచారం చేశారు. 84వ వార్డు వైకాపా కార్పొరేటర్ అభ్యర్థిని యశోద ప్రచారం నిర్వహించారు.
తెదేపా అభ్యర్థుల ప్రచారం..
అనకాపల్లిలోని ఐదు కార్పొరేట్ స్థానాల్లో బరిలో నిలిచిన తెదేపా అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ పార్టీ నాయకులు అనకాపల్లి బెల్లం మార్కెట్లో ప్రచారం చేశారు. తెదేపా అభ్యర్థులకు ఓటు వేయాలని వారు విజ్ఞప్తి చేశారు. తెదేపా తరఫున మహిళా అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరికి ఓటు వేయాలని కోరుతూ విశాఖ అర్బన్ జిల్లా ఉపాధ్యక్షులు మళ్ళ సురేంద్ర, బీ.ఎస్.ఎం.కే జోగినాయుడుతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రచారం చేశారు.
ఇదీ చదవండి:
పుర పోరుతో విశాఖలో సందడి