ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖ మద్దిలపాలెం కూడలిలో వైకాపా నేతల ఆందోళన నిర్వహించారు. వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి కన్నబాబు, మంత్రి అవంతి శ్రీనివాస్ ఈ నిరసనలో పాల్గొన్నారు. 'విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు' అని నినాదాలు చేశారు. వైకాపా నేతలు రాష్ట్ర బంద్‌లో పాల్గొని మానవహారం నిర్వహించారు. వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి.. మైక్ పట్టుకుని ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణపై కార్మిక సంఘాలు, సామన్యుల అభిప్రాయాలను తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైకాపా నేతల ఆందోళన - విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణపై వైకాపా నిరసన
విశాఖ మద్దిలపాలెం కూడలిలో ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైకాపా ముఖ్య నేతలు నిరసన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
![ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైకాపా నేతల ఆందోళన ysrcp protest against privatization of vishaka steel plant](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10878006-1-10878006-1614928298374.jpg)
ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైకాపా నేతల ఆందోళన
ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైకాపా నేతల ఆందోళన