విశాఖ జిల్లా నర్సీపట్నంలోని వైకాపా కార్యాలయంలో ఏర్పాటైన నియోజకవర్గ స్థాయి సమావేశంలో ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ పాల్గొన్నారు. 'జగన్ సైన్యం జనం కోసం' అనే నినాదంతో కూడిన పత్రికలను ఆవిష్కరించారు. మరో నెల రోజుల్లో వస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలన్నారు. గ్రామ స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ప్రణాళికలు రచించాలన్నారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం ప్రవేశపెట్టిన పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సమావేశానికి నాతవరం, గొలుగొండ, మాకవరపాలెం మండలాల నుంచి నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు.
'గ్రామస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయాలి' - నర్సీపట్నంలో వైకాపా నియోజకవర్గ సమావేశం
మరో నెల రోజుల్లో రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు కార్యకర్తలు అన్ని విధాలుగా సిద్ధంగా ఉండి గెలుపునకు కృషి చేయాలంటూ నర్సీపట్నం ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ సూచించారు. నర్సీపట్నంలో జరిగిన పార్టీ సమావేశంలో ఆయన పాల్గొని కార్యకర్తలకు దిశానిర్దేశం చేేశారు.
'గ్రామస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయండి'