ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విజయసాయిరెడ్డి వాహనంపై రాళ్ల దాడి..నిరసిస్తూ విశాఖలో వైకాపా నేతల ధర్నా - ysrcp leaders protest at visakha updates

ఎంపీ విజయసాయిరెడ్డి వాహనంపై రాళ్ల దాడిని నిరసిస్తూ విశాఖలో వైకాపా నాయకులు ధర్నా చేశారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది.

ysrcp leaders protest at visakha
విశాఖలో వైకాపా నేతల ధర్నా

By

Published : Jan 2, 2021, 7:22 PM IST

విశాఖలో వైకాపా తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త అక్కరమాని విజయనిర్మల ఆధ్వర్యంలో కార్యకర్తలు ధర్నా చేశారు. ఎంపీ విజయసాయిరెడ్డి వాహనంపై రాళ్ల దాడిని నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. ఎంవీపీ కూడలి వద్ద చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో అక్కడ తోపులాట జరిగింది.

ABOUT THE AUTHOR

...view details