లాక్డౌన్ నేపథ్యంలో విశాఖ నుంచి ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లే కూలీలకు భోజనాలు సమకూర్చడంలో దాతలు పెద్ద సంఖ్యలో ముందుకొస్తున్నారు. జుతీయ రహదారిపై విజయనగరం, శ్రీకాకుళం వెళ్లే వారికి వైకాపా కార్యకర్తలు భోజనాలు ఏర్పాటు చేశారు. రాజాపులోవ పెట్రోల్ బంకు పక్కన టెంట్లు వేసి వలస కూలీలకు రాత్రి భోజనం సమకూర్చుతున్నారు. భీమునిపట్నం మాజీ ఎంపీపీ వెంకటప్పడు ఆధ్వర్యంలో వైకాపా నాయకులు ఆహారం స్వయంగా వడ్డిస్తున్నారు. సామాజిక దూరం, మాస్కులతో కరోనా నిబంధనలు పాటిస్తూ అన్నార్తుల ఆకలి తీరుస్తున్నారు.
వలస కూలీల వైకాపా ఆధ్వర్యంలో ఆహారం పంపిణీ - వలస కూలీల వార్తలు
విశాఖలో వైకాపా నేతలు వలస కూలీలకు అన్నదానం చేశారు. కరోనా లాక్డౌన్ నేపథ్యంలో స్వగ్రామాలకు చేరుతున్నవారికి భీమునిపట్నం మాజీ ఎంపీపీ వెంకటప్పడు ఆధ్వర్యంలో ఆకలి తీరుస్తున్నారు.
వలస కూలీల ఆకలి తీరుస్తున్న వైకాపా నేతలు