మహిళా అధికారిపై మాజీ మంత్రి, తెదేపా సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడుపై చర్యలు తీసుకోవాలని విశాఖ జిల్లా నర్సీపట్నం నియోజకవర్గ మహిళా నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మున్సిపల్ కార్యాలయంలో అయ్యన్నపాత్రుడు తాత రుత్తల లాత్సాపాత్రుడి చిత్రపటాన్ని తొలగించడాన్ని నిరసిస్తూ ఈ నెల 15న తెదేపా ఆధ్వర్యంలో నిరసన తెలిపారు.
అయ్యన్నపాత్రుడిపై వైకాపా మహిళా నేతల ఫిర్యాదు - అయ్యన్నపాత్రుడిపై వైకాపా మహిళా నాయకుల ఫిర్యాదు
తెదేపా సీనియర్ నేత అయ్యన్నపాత్రుడుపై విశాఖ జిల్లా నర్సీపట్నం నియోజకవర్గ వైకాపా మహిళా నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహిళా అధికారిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
అయ్యన్నపాత్రుడిపై వైకాపా మహిళా నాయకుల ఫిర్యాదు
ఈ ధర్నాలో మున్సిపల్ కమిషనర్‌ను అయ్యన్నపాత్రుడు దూషించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అయ్యన్నపాత్రుడుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సీఐకి ఫిర్యాదు చేశారు.
ఇదీ చదవండి: ఈఎస్ఐ వ్యవహారంలో బెయిల్ కోసం అనిశా కోర్టుకు అచ్చెన్నాయుడు
TAGGED:
news on ayyannapathrudu