విశాఖలో వైకాపా ఆవిర్భావ దినోత్సవం
విశాఖలో వైకాపా ఆవిర్భావ దినోత్సవం - విశాఖలో వైకాపా ఆవిర్భావ దినోత్సవం న్యూస్
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించి నేటికి 9 సంవత్సరాలు. ఈ సందర్భంగా విశాఖ వైకాపా కార్యాలయంలో ఎంపీ విజయసాయిరెడ్డి పార్టీ జెండాను ఎగురవేశారు. ప్రతిపక్షాలు ..జగన్ ను గతంలో ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఆయన వెనకడుగు వేయలేదన్నారు. జగన్ ప్రజల అండతో పార్టీ ముందుకు నడిపారని తెలిపారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తరువాత ఎన్నో సంక్షేమపథకాలకు జగన్ శ్రీకారంచుట్టారని అన్నారు. విశాఖలో ప్రజలకు లక్షా 25 వేల ఇల్ల స్థలాలు సిద్ధం చేశామని ఆయన స్పష్టం చేశారు.
![విశాఖలో వైకాపా ఆవిర్భావ దినోత్సవం ysrcp-foundation-day-celebrations-in-vishaka](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6377242-thumbnail-3x2-ycp.jpg)
ysrcp-foundation-day-celebrations-in-vishaka