ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విశాఖలో ఘనంగా వైకాపా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు - ఈరోజు విశాఖలో వైకాపా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు తాజా వార్తలు

వైకాపా ఆవిర్భావ దినోత్సవాన్ని ఆ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వైకాపా జెండాను ఆవిష్కరించారు.

ysrcp formation day celebrations
వైకాపా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

By

Published : Mar 12, 2021, 12:24 PM IST

వైకాపా ఆవిర్భావ దినోత్సవాన్ని ఆ పార్టీ నాయకులు విశాఖలో ఘనంగా నిర్వహించారు. వైకాపా విశాఖ నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పార్టీ ప్రధాన కార్యాలయంలో జెండా ఆవిష్కరించారు. ముందుగా పార్టీ కార్యాలయంలో వై.ఎస్.రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. వైకాపా ఆవిర్భావం నుంచి నేటి వరకు ప్రజలతో మమేకమై వారి ఆదరాభిమానాలు పొందిందని వంశీకృష్ణ అన్నారు. పార్టీ కార్యకర్తలు ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పని చేయాలని సూచించారు.

నర్సీపట్నంలో వైకాపా ఆవిర్భావ దినోత్సవం..

నర్సీపట్నం మండలం పెద్ద బొడ్డేపల్లి పార్టీ కార్యాలయంలో వైకాపా ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు స్థానిక ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ఆధ్వర్యంలో.. వైయస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాజశేఖర్ రెడ్డి ఆశయాలను జగన్మోహన్ రెడ్డి ఆచరించే విధంగా అనేక పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారని ఎమ్మెల్యే గణేష్ అన్నారు. అదే స్ఫూర్తితో మరింత కాలం ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ చింతకాయల సన్యాసిపాత్రుడు తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి...

'విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించాల్సిన అవసరం లేదు'

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details