కశీంకోటలో వైఎస్ఆర్ బీమా చెక్కుల పంపిణీ - ysr insurance checks distribution news vishakapatnam
విశాఖ జిల్లా కశీంకోటలో వైఎస్ఆర్ బీమా చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఎమ్మెల్యే అమర్నాథ్ చేతుల మీదుగా చెక్కులను అందించారు.
![కశీంకోటలో వైఎస్ఆర్ బీమా చెక్కుల పంపిణీ ysr insurance checks distribution at kashimkota vishakapatnam](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7601516-908-7601516-1592048670516.jpg)
చెక్కులను అందిస్తున్న ఎమ్మెల్యే
విశాఖ జిల్లా కశింకోటలో వైఎస్ఆర్ బీమా చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ చేతుల మీదుగా బాధిత కుటుంబాలకు చెక్కులను అందించారు. 270 మందికి మూడు కోట్ల యాభై ఆరు లక్షల ఇరవై వేల రూపాయల చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... ప్రమాదవశాత్తు మృతిచెందిన, క్షతగాత్రులు, మిగిలిన వారి కుటుంబ సభ్యులకు వైఎస్ఆర్ బీమా ఉపయోగపడుతుందని తెలిపారు.