ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైఎస్సార్ ఆసరా కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే - ysr asara programme started by mla karnam dharmasri

పేదలు, మహిళల అభ్యున్నతి కై తమ ప్రభుత్వం కృషిచేస్తోందని విశాఖ జిల్లా చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ పేర్కొన్నారు. రోలుగుంట మండలం శరభవరంలో ఏర్పాటు చేసిన వైఎస్సార్ ఆసరా కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ధర్మశ్రీ లాంఛనంగా ప్రారంభించారు.

వైఎస్సార్ ఆసరా కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
వైఎస్సార్ ఆసరా కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

By

Published : Sep 14, 2020, 12:04 PM IST

విశాఖ జిల్లా రోలుగుంట మండలం శరభవరంలో వైఎస్సార్ ఆసరా కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో వైఎస్సార్ ప్రభుత్వం ఏర్పాటయినప్పటి నుంచి పేదలు, మధ్య తరగతి, మైనారిటీలు, మహిళా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా రోలుగుంట మండలానికి సంబంధించి వైఎస్సార్ ఆసరా కింద మంజూరైన పత్రాలను ఎమ్మెల్యే ధర్మ శ్రీ... మహిళా సంఘాలకు పంపిణీ చేశారు .ఈ కార్యక్రమంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్​రెడ్డి విగ్రహానికి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.

ఇదీచదవండి

విశాఖకు చేరుకున్న శారదా పీఠాధిపతులు

ABOUT THE AUTHOR

...view details