రానున్న ఎన్నికల్లో వైకాపాను ప్రజలే ఓడిస్తారని భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు తెలిపారు. విశాఖ జిల్లా పాయకరావుపేట వచ్చిన ఆయన.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నియంతలా పాలన సాగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వాతంత్రం వచ్చిన అనంతరం ఇలాంటి పాలన ఎన్నడూ చూడలేదన్నారు.
వచ్చే ఎన్నికల్లో వైకాపాను ప్రజలే ఓడిస్తారు: విష్ణుకుమార్ రాజు - andhrapradesh Bjp latest news
రానున్న ఎన్నికల్లో వైకాపాకు ప్రజలు గట్టి బుద్ధి చెబుతారని భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు అన్నారు. సీఎం వైఎస్ జగన్ నియంతలా పాలన సాగిస్తున్నారని విశాఖ జిల్లా పాయకరావుపేటలో ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఎన్నడూ ఇలాంటి దారుణమైన పాలన చూడలేదని ఎద్దేవా చేశారు.
వ్యతిరేకత పెరిగింది..
వైకాపా పాలనపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందన్నారు. మద్యం నుంచి ఇసుక వరకు అధిక ధరలు పెంచేశారన్నారు. ఉపాధి లేక యువత ఖాళీగా కాలం వెళ్లదీస్తున్నారని, పరిశ్రమలు ఏర్పాటు చేయడంలో ఘోరంగా విఫలమయ్యారని వివరించారు. రానున్న ఎన్నికల్లో భాజపా బలమైన శక్తిగా అవతరించబోతోందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇందుకు గ్రామస్థాయిలోనే పార్టీని బలోపేతం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు.
ఇవీ చూడండి : సైబర్ నేరాలు.. సాయుధుల సాయంతో ఛేదించిన పోలీసులు