ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పెళ్లింట విషాదం.. విద్యుదాఘాతంతో వరుడు మృతి - విశాఖ మన్యలో విద్యుత్ షాక్​తో వరుడు మృతి

మరికొన్ని గంటల్లో పెళ్లి బాజాలు మోగాల్సిన ఆ ఇంట్లో విషాదం కమ్మేసింది. పెళ్లి పీటలెక్కాల్సిన వరుడు విద్యుదాఘాతంతో విగతజీవిలా మారాడు. కొడుకు పెళ్లి చూడాలనుకున్న ఆ తల్లిదండ్రులు.. అతని చావును చూసి కన్నీరు మున్నీరుగా విలపించారు. ఈ విషాద ఘటనతో విశాఖ మన్యం మూగబోయింది.

పెళ్లింట విషాదం: విద్యుదాఘాతంతో వరుడు మృతి
పెళ్లింట విషాదం: విద్యుదాఘాతంతో వరుడు మృతి

By

Published : Jun 8, 2020, 9:54 PM IST

విశాఖ పాడేరు ఏజెన్సీ జి.మాడుగుల మండలం మద్దులబందలో గబ్బాక జనార్దన్ అనే యువకుడు విద్యుదాఘాతంతో మృతిచెందాడు. యువకుడికి మంగళవారం వివాహం జరగాల్సి ఉండగా.. ప్రమాదవశాత్తు మృత్యుఒడికి చేరాడు. సోమవారం సాయంత్రం ఇంట్లో విద్యుత్ లేదని గుర్తించిన యువకుడు విద్యుత్ స్తంభం ఎక్కాడు. దిగుతున్న క్రమంలో వైర్లు తాకి విద్యుదాఘాతానికి గురయ్యాడు.

యువకుడి ఒళ్లంతా ఇసుకతో కప్పి ప్రథమ చికిత్స చేసిన బంధువులు.. 108కి ఫోన్ చేశారు. ఫీడర్ అంబులెన్స్​లో జి.మాడుగుల ఆస్పత్రికి తరలించారు. యువకుణ్ని పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. ఈ ఘటనతో పెళ్లింట విషాదం నెలకొంది. వివాహ ఏర్పాట్లతో కళకళలాడిన ఇల్లు ఒక్కసారిగా విచారంలో మునిగిపోయింది.

ABOUT THE AUTHOR

...view details