ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'గిరిజ‌న యువ‌త‌కు ఉపాధి అవ‌కాశాలు క‌ల్పించ‌డ‌మే ల‌క్ష్యం' - The aim is to provide employment to the Visakha tribes

విశాఖ మన్యంలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో సంకల్పం కార్యక్రమాన్ని ప్రారంభించారు స్థానిక ఎస్పీ కృష్ణారావు. గిరిజన యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యమని పేర్కొన్నారు. యువకులు శిక్షణ కార్యక్రమాన్ని పూర్తిచేసి ఉపాధిని అందిపుచ్చుకోవాలని సూచించారు. కష్టపడి పనిచేయడమే విజయానికి సులువైన మార్గమని తెలిపారు.

Youth Training Center
గిరిజన యువతకు ఉపాధి

By

Published : Dec 1, 2020, 10:43 PM IST

పోలీసుశాఖ ఆధ్వర్యంలో చేపట్టిన సంక‌ల్పం కార్య‌క్ర‌మాన్ని గిరిజ‌న యువ‌త‌ స‌ద్వినియోగం చేసుకోవాల‌ని విశాఖ జిల్లా ఎస్పీ కృష్ణారావు అన్నా‌రు. మ‌న్యంలోని చింత‌ప‌ల్లి యువ‌జ‌న శిక్ష‌ణ కేంద్రంలో విద్యార్థులు, ఓఎస్డీ స‌తీష్‌కుమార్‌తో ఆయ‌న సమావేశం నిర్వహించారు. విద్య‌ ప్రాముఖ్యత, నైపుణ్యాల అభివృద్ధి గురించి విద్యార్థుల‌కు వివ‌రించారు. కష్టపడి పనిచేయడమే విజయానికి మార్గమని, సత్వరమార్గాలు ఉండవని ఎస్పీ స్పష్టం చేశారు.

గిరిజ‌న విద్యార్థులు భ‌విష్య‌త్తులో ఉన్న‌త శిఖ‌రాలు అధిరోహించ‌డానికే పోలీసుశాఖ సంక‌ల్పం కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని ఓఎస్డీ సతీష్ కుమార్ అన్నారు. బడి మానేసిన విద్యార్థుల‌కు గౌరవప్రదమైన ఉపాధి అవకాశాలను క‌ల్పించ‌డానికి ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని ఏఎస్పీ చింతపల్లి విద్యా సాగర్ నాయుడు అన్నారు. ఏ సమస్య ఎదురైనా సంప్రదించాలని పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details