విశాఖ జిల్లా చీడికాడ మండలం కోనాం మధ్యతరహా జలాశయం స్పిల్ వే గేట్లు దిగువ, ఎగువ ప్రాంతంలో పలువురు యువత విన్యాసాలు చేస్తున్నారు. ప్రమాదకరంగా ఉన్న ఈ ప్రాంతంలో స్నానాలు చేయడం, సెల్ఫీలు తీసుకుంటున్నారు. ఏ మాత్రం అదుపుతప్పినా.. పెను ప్రమాదాలు జరుగుతాయని సందర్శకులు ఆందోళన చెందుతున్నారు. అసలే వర్షాకాలం కావడంతో జలాశయం నిండుకుండను తలపిస్తోంది. ఈ పరిస్థితుల్లో జలవనరుల శాఖ అధికారులు నిఘా ఉంచాలని ప్రజలు కోరుతున్నారు.
కోనాం జలాశయం వద్ద యువత ప్రమాదకర విన్యాసాలు - కోనాం మధ్యతరహా జలాశయం
విశాఖ జిల్లా కోనాం మధ్యతరహా జలాశయం ప్రాంతంలోని స్పిల్ వే గేట్ల వద్ద యువత ప్రమాదకరంగా విన్యాసాలు చేస్తున్నారు. ఇక్కడే ఏ మాత్రం అదుపుతప్పినా ప్రమాదాలు జరుగుతాయని సందర్శకులు ఆందోళన చెందుతున్నారు
కోనాం మధ్యతరహా జలాశయం ప్రాంతంలో యువత సెల్పీలు