ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైద్యుల పిలుపుతో రక్తదానానికి యువత ముందడుగు - పాడేరు నేటి వార్తలు

విశాఖపట్నం జిల్లా ఏజెన్సీ కేంద్రం పాడేరు జిల్లా ఆస్పత్రిలో రక్త నిల్వలు నిండుకున్నాయి. ఈ మేరకు వైద్యుల పిలుపుతో స్థానిక యువకులు ముందుకు వచ్చారు. రక్త దానం చేసి ఆదర్శంగా నిలిచారు.

Youth move to donate blood in paderu vizag district
వైద్యుల పిలుపుతో రక్తదానానికి యువత ముందడుగు

By

Published : Mar 20, 2021, 5:14 PM IST

విశాఖపట్నం జిల్లా పాడేరు జిల్లా ఆస్పత్రిలో రక్త నిల్వలు నిండుకున్నాయి. అనకాపల్లి, విశాఖపట్నం ఆసుపత్రుల్లోనూ రక్తం కొరత ఉన్న కారణంగా.. రక్తదానం చేయాలంటూ వైద్యులు రవి పాడేరు యువతకు పిలుపునిచ్చారు.

వైద్యుల పిలుపుతో పది మంది యువకులు పాడేరు ఆస్పత్రికి వచ్చి రక్తదానం చేశారు. యువత ఇదే విధంగా ముందుకు వచ్చి రక్తదానం చేస్తే రోగులకు ఉపయోగకరంగా ఉంటుందని వైద్యులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details