విశాఖ జిల్లా భీమునిపట్నం మండలం అమనాం పంచాయతీలోని ఎస్కెఎంఎల్ యూత్ ఆహారం పంపిణీ చేశారు. జాతీయ రహదారిపై కాలి నడకన వెళ్తున్న వలస కూలీలకు, వివిధ వాహనాలుపై స్వగ్రామాలకు చేరుతున్న వారికి అల్పాహారం, మధ్యాహ్న భోజనం ప్యాకెట్లను అందజేశారు. కరోనా సహాయక చర్యల్లో భాగంగా రెండు రోజులుగా వీరు ఈ సేవలందిస్తున్నారు. గ్రామంలో వంట చేయించి ప్యాకెట్లుగా తయారుచేసి పోలీసుల సహకారంతో ద్విచక్ర వాహనాలపై వెళ్లి ఆహారం అందజేస్తున్నారు. జాతీయ రహదారిపై పోలిపల్లి, లింగాలవలస, తగరపువలస వంటి పలు ప్రాంతాల్లో వీరు ఆహారం పంపిణీ చేశారు.
వలస కూలీలకు ఆహారం పంపిణీ - ఎస్కెఎమ్ఎల్ యూత్ తాజా వార్తలు
కరోనా సహాయక చర్యల్లో మేము సైతం అంటూ గ్రామీణ యువత ముందుకొస్తున్నారు. జాతీయ రహదారులపై నడిచి వెళ్తున్న వలస కూలీలకు, రోజువారీ కూలీలకు, నిరుపేదలకు ఆహారం అందిస్తూ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు విశాఖకు చెందిన యువత.
![వలస కూలీలకు ఆహారం పంపిణీ youth food packets distribution for migrate labours](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7243039-706-7243039-1589779320210.jpg)
వలస కూలీలకు ఆహార పంపిణీ చేసిన యువత